Vijayawada : రేపటి నుంచి నిత్యావసరాలు పంపిణీ : మంత్రి నాదెండ్ల

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి నిత్యావసరాలు పంపిణీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ-పోస్ మిషన్ ద్వారా నిత్యావసరాలు ఇస్తామన్నారు. ముంపు ప్రాంతాల్లో 12 అదనపు సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, 2 లక్షల మందికి సరకులు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డు లేని వారికి ఆధార్ లేదా బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు. భారీ వర్షాలు, వరదలతో విజయవాడ నగరం అతలాకుతలమైంది. ఇంకా లక్షలాది మంది ప్రజలు జలదిగ్భందంలోనే చిక్కుకున్నారు. ఇలాంటి వారికి నిత్యవసర సరుకులను ఉచితంగా అందిస్తామని ప్రకటించింది.శుక్రవారం ఉదయం నుండి విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం ఈ ఉచిత నిత్యవసర సరుకుల పంపిణి కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈవిషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే ఈనిత్యవసర సరుకుల పంపిణికి రేషన్ కార్డులు లేని వారికి కూడా ఇస్తామని తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com