LOKESH: తప్పు చేయకపోతే భయమెందుకు..?

ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తుదంటూ వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. 'రెడ్ బుక్ గురించి ఎందుకు భయపడుతున్నారు? . చట్టాల్ని ఉల్లంఘించి ప్రజలను, టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారులను, నాయకులను వదిలిపెట్టనని చెప్పాను. చట్టాలు ఉల్లంఘించిన వాళ్లకే రెడ్ బుక్ భయం ఉంటుంది. చట్టాలను ఉల్లఘించారు కాబట్టే రోజా భయపడుతున్నారేమో' అంటూ లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. అయిదేళ్ల వైసీపీ అస్తవ్యస్త పాలన వల్ల ఆంధ్రప్రదేశ్ దివాళా తీసిందని నారా లోకేశ్ విమర్శించారు. పారిశ్రామికవేత్తలను వేధిస్తే పెట్టుబడులు ఎలా పెడతారని ప్రశ్నించారు. సుస్థిర పాలన వల్లే మహారాష్ట్రకు ఎక్కువ పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. పారిశ్రామిక వేత్తలను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించేందుకు చాలా శ్రమించాల్సి వస్తోందని నారా లోకేశ్ మండిపడ్డారు. జగన్ వల్లే ఈ దుస్థితి వచ్చిందన్నారు.
ఏ ఒక్కరినీ వదిలిపెట్టం: లోకేశ్
రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై మంత్రి నారా లోకేశ్ తాజాగా స్పందించారు. పదవిలో ఉన్నా లేకున్నా తప్పు చేస్తే వదిలే ప్రసక్తి లేదన్నారు. అయితే, గత ప్రభుత్వ అవినీతి కేసులపై వెంటనే విచారణ జరపడం కుదరదన్నారు. చట్టాలను ఉల్లంఘించిన అధికారులు, రాజకీయ నాయకులు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. ఒక్కొక్కటిగా అన్ని కేసులు విచారణకు వస్తాయని చెప్పారు.
తల్లి, చెల్లికే జగన్‌పై నమ్మకం లేదు: లోకేశ్
డిప్యూటీ సీఎం పదవిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూదు. పార్టీలోని అందరికి అన్ని అవకశాలు రావాలి అనేది నా అభిప్రాయం. నేను ఒక కార్యకర్తగానే పనిచేస్తా. చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తా’ అని అన్నారు. అటు VSR రాజీనామాపై స్పందిస్తూ.. తల్లి, చెల్లికే జగన్‌పై నమ్మకం లేదని, ఇంకా పార్టీ నాయకులకు ఏముంటుందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com