AP: రెడ్ బుక్ పేరు ఎత్తితే గుండె పోట్లు: లోకేష్

AP: రెడ్ బుక్ పేరు ఎత్తితే గుండె పోట్లు: లోకేష్
X
మరో 40 ఏళ్లు పసుపు జెండానే ఎగురుతుందన్న లోకేశ్... తమకు ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసని వ్యాఖ్య

రెడ్ బుక్ పేరు ఎత్తితే కొందరికి గుండెపోట్లు వస్తున్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. కొందరు అయితే బాత్రూమ్‌లో జారి పడి చేయి విరగొట్టుకున్నారని, టీడీపీ జెండాను పీకేస్తామన్న వాళ్లంతా అడ్రస్ లేకుండా పోయారన్నారు. నలుగురు ఎమ్మెల్యేలను లాక్కుంటే ప్రతిపక్ష హోదా ఉండదన్న వాళ్లకు ఈ రోజు ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన ఘనత టీడీపీదని చెప్పారు. మరో 40 ఏళ్ల పాటు పసుపు జెండా ఇలానే రెపరెపలాడాలని పేర్కొన్నారు. ‘‘మంచి చేస్తే మీరు మెచ్చకుంటారు.. అదే తప్పు చేస్తే నా తోలు కూడా తీస్తారు’’.. అని లోకేశ్ అన్నారు. ప్రాంతీయ పార్టీకి కోటి సభ్యత్వాలు అనేది అసాధారణమైన రికార్డ్ అని, అలాంటి రికార్డును 83 రోజుల్లో టీడీపీ సాధించిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటూ అండమాన్ నికోబార్‌లో కూడా సభ్యత్వాలు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

మాకు ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు

తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గల్లీ పాలిటిక్స్ తెలుసు - ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ ఆవిర్భావ సభలో పాల్గొన్న లోకేశ్... జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాలను శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని చెప్పిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. పార్టీని మ‌రింత ముందుకు తీసుకువెళ్లేందుకు ప్ర‌తి ఒక్క‌రూ స‌హ‌క‌రించాల‌ని నారా లోకేష్ సూచించారు. పార్టీ అదినేత చంద్ర‌బాబు విజ‌న్‌కు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లాల‌ని సూచించారు. కృషి ఉంటే మ‌నుషులు రుషుల‌వుతార‌ని చెప్పిన పార్టీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ స్ఫూర్తిగా ప్ర‌తి ఒక్క‌రూ ముందుకు సాగాల‌న్నారు.

మంత్రి లోకేష్‌తో గొట్టిపాటి కీలక భేటీ

దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు కడియాల లలిత్ సాగర్ లు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ను క్యాంపు కార్యాలయంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా దర్శి నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలపై డాక్టర్ లక్ష్మీ దంపతులు యువ నేతతో సుదీర్ఘంగా చర్చించారు.

Tags

Next Story