MLA Kotamreddy : జిల్లా చరిత్రలో మంత్రి నారాయణ పేరు నిలిచిపోతుంది

జిల్లా చరిత్రలో మంత్రి నారాయణ పేరు సువర్ణ అక్షరాలతో నిలిచిపోతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరులో విద్యాశాఖామంత్రి నారా లోకేష్ పర్యటన సందర్భంగా VRC లో జరుగుతున్న ఏర్పాట్లను రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణతో కలిసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. విఆర్సి పాఠశాలను ఆధునీకరించిన తర్వాత తొలిసారి ఎమ్మెల్యే కోటంరెడ్డి విచ్చేశారు..మంత్రితో కలిసి క్రిడామైదానాన్ని , తరగతి గదులు ,అదునాతన ల్యాబ్ లను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు..ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.. ఘన చరిత్ర కలిగిన వీఆర్ హైస్కూల్ దీనస్థితిలోకి వెళ్ళిపోయిందని..వీఆర్సీని చదువుల తల్లి కలల స్వర్గంగా మార్చేందుకు మంత్రి నారాయణ చేసిన కృషి అభినందనీయమన్నారు..మంత్రి కుమార్తె షరీణికు బాధ్యతలు అప్పగించి అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు..తాను చదివిన వీఆర్సీ ఇంత గొప్పగా రూపుదిద్దుకొంటుందని అసలు ఊహించలేదన్నారు..భారత దేశంలోనే ఎక్కడా ప్రభుత్వ స్కూల్స్ లో సాధ్యం కానిది మంత్రి నారాయణ సాధించారని హర్షం వ్యక్తం చేశారు..అసాధ్యాన్ని సాధ్యం చేసిన మంత్రి నారాయణని రాజకీయాలకి అతీతంగా అందరూ అభినందించాల్సిందేనని ఆయన తెలిపారు..ధనవంతులు, పూర్వవిద్యార్థులు ఈ స్కూల్ ని సందర్సించాలని..అప్పుడే మరికొన్ని స్కూల్స్ రూపురేఖలు మారుతాయన్నారు. నారాయణసార్ జన్మ ధన్యమైందన్నారు..రాజకీయాల్లో అతికొద్దిమందికి ఇలాంటి అవకాశాలు వస్తాయని..ఇలాంటి అవకాశాన్ని మంత్రి నారాయణ సద్వినియోగం చేసుకున్నారన్నారు....రాబోయే రోజుల్లో మరిన్ని స్కూల్స్ ని వీఆర్సీ తరహాలో సిద్ధం చేస్తామన్న మంత్రి సంకల్పం నెరవేరాలన్నారు..ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆనంద్ ,ఎస్పీ క్రిష్ణకాంత్ ,జాయింట్ కలెక్టర్ కార్తీక్ ,కమిషనర్ నందన్ ,డీఈఓ బాలాజీరావు ,రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ,డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ,మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ తాళ్ళపాక అనూరాధ ,మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి ,ప్రిన్సిపాల్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com