Andhra Pradesh : మంత్రి నిమ్మలపై దాడి కేసు సిఐడికి అప్పగింత.

Andhra Pradesh : మంత్రి నిమ్మలపై దాడి కేసు సిఐడికి అప్పగింత.
X

గత వైసిపి ప్రభుత్వంలో మంత్రి నిమ్మల రామానాయుడు పై జరిగిన దాడికి సంబందించిన కేసును సిఐడికి అప్పగించారు. అప్పట్లో దాడి ఘటన పై పాలకొల్లు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా, వైసిపి రాజకీయ ప్రమేయంతో కేసు నమోదు చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2022 లో చేసిన ఫిర్యాదును కేసుగా నమోదు చేశారు. నర్సాపురం డిఎస్పి విచారణ నేపధ్యంలో తాజాగా దీనిపై లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిఐడికి బదలాయిస్తూ డిజిపి ఉత్తర్వులు జారీ చేశారు.

విజయవాడ సిఐడి డిఎస్పీ మోహాన్ నేతృత్వంలో అయిదుగురు సభ్యులతో కూడిన సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబందించి పూర్తి వివరాల్లోకి వెళ్తే 2022 లో వైసిపి ప్రభుత్వంలో పాలకొల్లు పట్టణ టిడ్కో గృహాల కాలనీ వద్ద జరిగిన గృహాల పంపిణీ కార్యక్రమం జరిగింది. అప్పటి మంత్రులు ఆదిమూలం సురేష్, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యన్నారాయణ, మరియు అప్పటి నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద రాజు గార్లు పాల్గొన్నారు. ప్రొటోకాల్ ప్రకారం నాటి అధికారిక ఇళ్ళ పంపిణీ సభకు స్దానిక శాసన సభ్యుడు డాక్టర్. నిమ్మల రామానాయుడు అధ్యక్షత వహించవలసి ఉండగా, అధికారుల పిలుపు మేరకు సభాకార్యక్రమంలో పాల్గొనడానికి, సభావేదికపైకి అప్పటి స్దానిక ఎమ్మెల్యేగా ఉన్న నిమ్మల రామానాయుడు, అప్పటి ఎమ్మెల్సీ అంగర రామ్మోహాన్ గారు వేదిక పైకి ఎక్కుచుండగా, ప్రొటోకాల్ లేకుండా సభావేదిక కు సంబందం లేని, వైసిపి కార్యకర్తలు మరికొంతమంది కిరాయి మూకలను కుట్రపూరితంగా వేదికపై ఉంచి స్దానిక శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహాన్ ను, వేదిక పైకి వస్తుండగా, వారిని రాకుండా నిరోధించి వారిపై భౌతిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిమ్మల రామానాయుడుకు రక్షణగా నిలిచిన వారిపై కూడా భౌతిక దాడికి పాల్పడ్డారు.ఈదాడిలో వైసిపి కార్యకర్తలు ఉపయోగించిన బటన్ నైఫ్ ను అప్పటి పోలీసు వారు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై స్దానిక పోలీస్ స్టేషన్ కు, డిజిపి, డిఐజి, ఎస్పీ, కలెక్టర్ కు ఫిర్యాదులు చేసినప్పటికీ మరియి నాటి శాసనసభ్యులు డాక్టర్. నిమ్మల రామానాయుడు మరియు భాదితులపై దాడిని నిరసిస్తూ,నాటి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గారు సైతం డిజిపి కి ఫిర్యాదు చేసినప్పటికీ అప్పటి వైసిపి ప్రభుత్వం, స్దానిక నాయకులు వత్తిడితో కేసు నమోదు చేయకపోగా, అప్పటి భాదితులపై ఎదురు కేసులు నమోదు చేసి, కోర్టుల చుట్టూ తిప్పుచున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2022 సంవత్సరంలో జరిగిన దాడిపై, అప్పటి ఫిర్యాదును కేసుగా నమోదు చేసి, నర్సాపురం డిఎస్పీ శ్రీ వేద విచారణ చేపట్టారు. అప్పట్లో శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు గారిపై పధకం ప్రకారం కుట్రపూరిత దాడికి పాల్పడ్డారని, ఆసమయంలో దాడిచేసిన వ్యక్తులు మారణాయుధాలు ధరించారని, విచారణలో పేర్కొన్నారు.సదరు దాడిని నిరోధించడానికి ప్రయత్నించిన వ్యక్తులపై కూడా భౌతిక దాడి చేసి, కులం పేరుతో దూషించారని, పోలీసు విచారణ లో సాక్ష్యులు తెలిపారు. ఈదాడిలో కొంత మంది మారణాయుధాలతో నిమ్మల రామానాయుడు పై దాడికి పాల్పడగా, తృటిలో తప్పించుకున్నారని,ఈ దాడిలో బలమైన కుట్ర ఉన్నట్లు, కుట్రకోణంపై లోతైన దర్యాప్తు జరపాలని, సిఐడి ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ సిఐడి డిజిపి ఆదేశాలు జారీచేశారు.

Tags

Next Story