peddireddy : రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పెద్దిరెడ్డి

peddireddy : రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి పెద్దిరెడ్డి
peddireddy : వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లను అమర్చే ప్రక్రియను వేగవంతం చేసింది జగన్‌ సర్కార్‌.

peddireddy : వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లను అమర్చే ప్రక్రియను వేగవంతం చేసింది జగన్‌ సర్కార్‌. సచివాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 6 నెలల్లో మీటర్లు ఏర్పాటు పూర్తి చేయాలని డిస్కం అధికారులను ఆదేశించారు. అలాగే రైతులు వినియోగించుకున్న విద్యుత్‌కు చెల్లించాల్సిన సొమ్మును ప్రభుత్వమే భరిస్తూ.. ఆ సబ్సిడీ మొత్తాలను రైతుల ఖాతాలకే నేరుగా డిబిటి కింద జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇందుకోసం రైతులతో ఈ నెలాఖరు నాటికి బ్యాంకు ఖాతాలను తెరిపించే ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.

విద్యుత్ మీటర్ల ఏర్పాటు వల్ల వ్యవసాయానికి నికరంగా రైతులు ఎంత మేరకు విద్యుత్ ను వినియోగించుకుంటున్నారో ఖచ్చితమైన వివరాలు తెలుస్తాయని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా 28వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ లకు మీటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ జిల్లాలో 26వేల వ్యవసాయ కనెక్షన్లకు 101.51 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకున్నారని డిస్కంలు లెక్కలు వేశాయని తెలిపారు. దాని ప్రకారం విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించిందని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story