CM Jagan : సీఎం జగన్‌తో ముగిసిన మంత్రి పేర్ని నాని భేటీ

CM Jagan :  సీఎం జగన్‌తో ముగిసిన మంత్రి పేర్ని నాని భేటీ
X
CM Jagan : సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. ఈనెల 10న చిరంజీవి, నాగార్జున అధ్వర్యంలో సీఎంతో సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు.

CM Jagan : సీఎం జగన్‌తో మంత్రి పేర్ని నాని భేటీ ముగిసింది. ఈనెల 10న చిరంజీవి, నాగార్జున అధ్వర్యంలో సీఎంతో సినీ పరిశ్రమ ప్రముఖులు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో.. సమావేశంలో ప్రభుత్వపరంగా చర్చించాల్సిన అంశాలపై సీఎంతో మంత్రి సమాలోచనలు జరిపారు. సినిమా టికెట్ల ధరల పెంపు, సినీ పరిశ్రమకు రాయితీలు, థియేటర్లలో వసతుల కల్పనపై చర్చ జరిగింది. సినిమా టికెట్ల ధరల పెంపు అంశంపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికపై సీఎంతో చర్చించారు.రేపు మరోసారి ముఖ్యమంత్రితో మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. 10వ తేదీ సమావేశంలో చర్చించాల్సిన మరిన్ని అంశాలపై చర్చించనున్నారు.

Tags

Next Story