మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు..!

మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామంలో ఏదైనా అభివృద్ధి పనులు చేయించాలంటే పక్క గ్రామ సర్పంచ్‌తో చేయించుకోవాలని సూచించారు. అలాగే, పక్క గ్రామ సర్పంచ్‌తో మీ ఊర్లో పనులు చేయించుకోవాలంటూ సలహా ఇచ్చారు. సర్పంచ్ హోదాలో ఉన్నారు కదా అని.. మీకు మీరుగా గ్రామంలో పనులు చేయిస్తే.. కమీషన్లు సమర్పించుకోవాల్సి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు. పనులు చేసినందుకు పర్సంటేజ్ ఇవ్వందే ఏఈ వదలడని బహిరంగంగా చెప్పుకొచ్చారు. సీఎంఎఫ్‌ఎస్ పర్సంటేజీ ఇవ్వకపోతే బిల్లు చేయడని పబ్లిక్‌గానే చెప్పేశారు. ఇక బిల్లు వచ్చాక పంచాయతీ సెక్రటరీకి, ఎండీవోలు చెక్కు రాయని, వీళ్లందరికీ పర్సంటేజీలు ఇస్తూ పోతే ఇక మిగిలేది కూడా ఏమీ ఉండదన్నారు పేర్ని నాని. భీమవరంలో పంచాయతీ సర్పంచ్ శిక్షణా కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com