Minister Roja: ఆటోవాలా అవతారమెత్తిన మంత్రి రోజా..

Minister Roja: ఆటోవాలా అవతారమెత్తిన మంత్రి రోజా..
X
Minister Roja: తిరుపతిలో వాహన మిత్ర పథకం కింద లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన రోజా.. ఖాకీ షర్ట్ ధరించి ఆటో నడిపారు.

Minister Roja: ఏపీ మంత్రి రోజా.. ఆటోవాలా అవతారమెత్తారు. తిరుపతిలో వాహన మిత్ర పథకం కింద లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి రోజా.. ఖాకీ షర్ట్ ధరించి ఆటో నడిపారు. ఆటోలో ఎంపీ గురుమూర్తితో పాటు ఆటో నడిపే మహిళలు ఉన్నారు. వీరిని ఉత్సాహపరిచేందుకు ఆటో నడిపారు మంత్రి రోజా ఎంతో అనుభవమున్న డ్రైవర్‌లా ఆటోనూ పరుగులు పెట్టించారు . ఈ సీన్ అక్కడున్నావారిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి రోజా.. ఆటో డ్రైవర్ల పిల్లలు కూడా మంచి చదువులు చదవాలన్నారు. వాహనమిత్ర కింద.. ఆటో డ్రైవర్లకు నాలుగు విడుతలుగా ఒక్కొక్కరికీ రూ.40వేలు జమ చేసినట్లు తెలిపారు మంత్రి రోజా.

Tags

Next Story