Minister Savitha : ప్రసన్న కుమార్ రెడ్డి వాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి

వేమిరెడ్డి ప్రశాంతి పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిని వైసిపి పార్టీ నుంచి జగన్ సస్పెండ్ చేయాలని మంత్రి సవిత డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసిపి వికృత చేష్టలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని నిప్పులు చెరిగారు, వైసీపీ నేతలంతా మహిళలను విమర్శించే పనిలో ఉన్నారని మండిపడ్డారు. మహిళలు ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పురాణాలు చెబుతున్నాయన్నారు. కానీ జగన్ అండ్ కో మాత్రం మహిళల పట్ల ప్రవర్తిస్తున్న తీరు సిగ్గు చెటన్నారు.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే ప్రశాంతి రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com