AP : జగన్ సర్కారుపై మంత్రి సవిత హాట్ కామెంట్స్

AP : జగన్ సర్కారుపై మంత్రి సవిత హాట్ కామెంట్స్
X

ఏపీలో వైసీపీ హయాంలో అధికారులను తుపాకీ పెట్టి బెదిరించి పనులు చేసుకున్నారని ఆరోపించారు మంత్రి సవిత. కడప డీఆర్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రి సీఎం చంద్రబాబు చేస్తున్న మంచి పాలనకు అధికారులంతా సహకరించాలన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా పాలన సాగించడానికి సీఎం అహర్నిశలు కృషి చేస్తున్నారనీ మంత్రి గుర్తు చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కొందరు అధికారులు నిజాయితీగా పనిచేస్తే, మరికొందరు అధికారులు రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి పనిచేశారని ఆరోపించారు. కడప రూపురేఖలు మార్చడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని, జిల్లా అధికారులంతా ప్రజాప్రతినిధులకు సహకరించి పనులు చేయాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story