AP : ఉచిత బస్సుపై అధ్యయనానికి మంత్రుల కమిటీ

మహిళలకు ఉచిత బస్సు పథకం వివిధ రాష్ట్రాల్లో ఎలా అమలవుతుందో అధ్యయనం చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌కు అనువైన పథకాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు ఓ సర్క్యులర్‌లో తెలిపింది. రవాణా, మహిళా-శిశు సంక్షేమ , హోంశాఖ మంత్రులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని వివరించింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూటమి ప్రకటించింది.
మరోవైపు అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎంవో అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఆయా జిల్లాల్లో తాజా పరిస్థితులను అధికారులు వివరించారు. భారీ వర్షాలు ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు స్కూళ్లకూ సెలవులు ఇచ్చినట్లు సీఎం కు చెప్పారు. వర్షంతో దెబ్బతిన్న పంటనష్టం వివరాలు సేకరించి రైతులకు సాయం అందించాలని చంద్రబాబు ఆదేశించారు. పూర్తి అప్రమత్తంగా ఉండి పనిచేయాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com