Minister Roja: తిరుమల దర్శనం రూల్స్‌ని బ్రేక్‌ చేసిన రోజా.. 30మంది అనుచరులతో..

Minister Roja: తిరుమల దర్శనం రూల్స్‌ని బ్రేక్‌ చేసిన రోజా.. 30మంది అనుచరులతో..
Minister Roja: తిరుమల ఆలయంలో మంత్రులు హంగామా చేస్తున్నారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

Minister Roja: తిరుమల ఆలయంలో మంత్రులు హంగామా చేస్తున్నారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో పెత్తనం చెలాయిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతిస్తున్నారు. మంత్రులు తమ బంధువులు, అనుచరులకు వీఐపీ దర్శనాలు కల్పిస్తూ భక్తులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. ఇవాళ మంత్రి రోజా ఏకంగా 30మంది అనుచరులకు దగ్గరుండి మరీ బ్రేక్ దర్శనం కల్పించారు. రోజా ఒత్తిడితో 10మందికి ప్రోటోకాల్ దర్శనం కల్పించారు. మరో 20 మందికి బ్రేక్ దర్శనం కల్పించారు. అనుచరులకు దర్శనం అయ్యేంత వరకు ఆలయంలోనే ఉన్నారు మంత్రి రోజా.

వాస్తవానికి 21వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కానీ మంత్రి రోజా మాత్రం టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ.. మందీమార్బలంతో శ్రీవారిని దర్శించుకోవడంపై భక్తులు తీవ్ర విమర్శలు వ్యక్తం చేశారు. ఓవైపు సామాన్య భక్తులు క్యూలైన్లలో ఇబ్బంది పడుతుంటే.. మంత్రులు ఇలా తమ అనుచరులకు బ్రేక్ దర్శనాలు కల్పించడంపై భక్తులు మండిపడుతున్నారు. దేవుడి వద్ద అధికార పెత్తనం అంటూ నిలదీస్తున్నారు.

మూడు రోజుల క్రితం మంత్రి ఉషా శ్రీ చరణ్‌ కూడా అనుచులతో తిరుమల ఆలయలో హంగామా చేశారు. 50 మంది అనుచరులతో వీఐపీ బ్రేక్‌ దర్శనానికి వెళ్లడం వివాదాస్పదంగా మారింది. పైగా మరో పది మంది అనుచరులతో సుప్రభాత సేవకు వెళ్లారామె. అయితే తిరుమలకు భక్తులు పోటెత్తుతుండటంతో టీటీడీ.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు చేసింది. కానీ మంత్రి ఉషా శ్రీ చరణ్‌ మాత్రం టీటీడీ అధికారులపై ఒత్తిడి తెచ్చి మరీ.. దర్శనం కల్పించారు.

దర్శనం అనంతరం బయటకు వచ్చిన మంత్రి ఉషా శ్రీని.. మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు భారీ అనుచరగళంతో ఎలా దర్శనానికి వెళ్తారని ప్రశ్నించారు. దీంతో మీడియా ప్రతినిధుల పట్ల మంత్రి గన్‌మెన్‌లు దురుసుగా ప్రవర్తించారు. మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండానే మంత్రి అక్కడి నుంచి వెళ్లిపోయారు. గన్‌మెన్‌ల తీరుపై మీడియా ప్రతినిధులు మండిపడుతున్నారు.

మొన్న సిదిరి అప్పలరాజు కూడా భక్తుల రద్దీ సమయంలో మందీమార్బలంతో తిరుమలకు వచ్చి భక్తులకు ఇబ్బంది కలిగించారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తులను పట్టించుకోకుండా తమ అనుచరులకు బ్రేక్ దర్శనాలు కల్పించారు. ఇలా శ్రీవారి ఆలయంలో మంత్రుల పెత్తనం ఏంటని భక్తులు మండిపడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story