AP : జాడలేని పెద్దపులి.. రాజమండ్రిలో భయం భయం

రాజమండ్రి శివారు ప్రాంతాల్లో సంచరించిన చిరుత పులి జాడ లేకుండా పోయింది. దాదాపు ఐదు రోజులుగా ఎక్కడా ఆనవాళ్లు లేకుండా మాయం అయ్యింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం వద్ద గోదావరి లంకల్లో చిరుత పులిని చూశామని కొందరు మత్స్యకారులు చెప్పడంతో అక్కడి ప్రజలు హడలిపోయారు. ఫారెస్ట్ సిబ్బంది సుమారు 40 మందితో ఆ ప్రాంతంలో జల్లెడపట్టారు. బోట్లపైనా..డ్రోన్ కెమెరాలతో సెర్చింగ్ ఆపరేషన్ నిర్వహించి చిరుత లేదని క్లారిటీ ఇచ్చారు. గత నెల 5న దివాన్ చెరువు వద్ద తొలిసారి కనిపించిన చిరుత..తర్వాత కడియపులంక ప్రాంతానికి వచ్చి స్థానికులను హడలెత్తించింది. దాదాపు ఐదు రోజులుగా ఎక్కడా కనిపించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని..పుకార్లు నమ్మి భయ బ్రాంతులకు గురి కావద్దని జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్ రావు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com