Pawan Kalyan Orders : మిషన్ ఫారెస్ట్..సజ్జల అక్రమాలపై విచారణకు పవన్ ఆదేశం

మాజీ ప్రభుత్వ సలహాదారు YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు భూ ఆక్రమణకు పాల్పడ్డట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. కడప జిల్లా సీకే దిన్నె రెవెన్యూ పరిధిలోని 1599, 1600/1, 2, 1601/1, 12, 255 పాటు ఇతర సర్వే నెంబర్లలోని భూములు సజ్జల కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉన్నాయి. అయితే 42 ఎకరాల అటవీ భూములను సజ్జల ఫ్యామిలీ ఆక్రమించిందని ఆరోపణలున్నాయి. దీంతో సమగ్ర విచారణ చేపట్టి, నివేదిక ఇవ్వాలని కడప జిల్లా కలెక్టర్‌ను పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఎవరి ఆధీనంలో ఉన్నాయి.. వన్యప్రాణులకు ఎలాంటి హాని కలిగింది.. వంటి అంశాలపై విచారణ జరపాలని సూచించారు. అంతేకాదు అటవీ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com