వైసీపీ రాక్షసులకు, తెలుగుదేశం దేవతలకు మధ్య యుద్ధం జరుగుతుంది : ఎమ్మెల్యే బాలకృష్ణ

వైసీపీ రాక్షసులకు, తెలుగుదేశం దేవతలకు మధ్య యుద్ధం జరుగుతుంది :  ఎమ్మెల్యే బాలకృష్ణ
ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన సాగుతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీ రాక్షసులకు, తెలుగుదేశం దేవతలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన సాగుతోందని సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆరోపించారు. ప్రస్తుతం వైసీపీ రాక్షసులకు, తెలుగుదేశం దేవతలకు మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనకు వచ్చిన బాలయ్య.. కిరికెర పరిసర ప్రాంతాల్లోని పంట పొలాలను పరిశీలించారు. 73 లక్షల ఎకరాల్లో 17 వేల కోట్ల విలువైన పంట నష్టపోతే సర్కారు కేవలం 277 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ మాత్రమే ఇచ్చిందని విమర్శించారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి తీరా అధికారంలోకి వచ్చాక.. రైతుల వెన్నెముక విరుస్తున్నారని ప్రభుత్వంపై బాలకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story