Balakrishna : ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధం : బాలకృష్ణ
By - TV5 Digital Team |4 Feb 2022 7:13 AM GMT
Balakrishna : హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోరుబాట పట్టారు.
Balakrishna : హిందూపురం పట్టణాన్ని జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పోరుబాట పట్టారు. జిల్లా కేంద్ర సాధన కోసం అవసరమైతే తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని బాలకృష్ణ ప్రకటించారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా చేసేందుకు కావాల్సిన అన్ని వసతులు ఉన్నాయన్నారు. వంద ఏళ్లుగా ప్రధాన పట్టణంగా ఉన్న హిందూపురంను జిల్లా కేంద్రం చేయడమే సరైన మార్గమన్నారు. కొద్ది రోజులుగా ఈ అంశంపై స్థానికంగా జరుగుతున్న ఉద్యమానికి బాలకృష్ణ మద్దతు పలికారు. మొదట పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలయ్య మౌనదీక్ష ప్రారంభించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com