ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమం.. వైరల్ అవుతున్న ఆడియో కాల్

ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమం.. వైరల్ అవుతున్న ఆడియో కాల్
ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి వచ్చిన సమయంలో ఎవరైనా అతి చేస్తే వారి ఇళ్ల వద్దకు వచ్చి కొడతానని వార్నింగ్‌ ఇచ్చారు.

ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమం వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కేతిరెడ్డి అనుచరుడి ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి పథకాల లబ్ధిదారులు హాజరు కాకపోతే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు ధర్మవరం 23వ వార్డు కౌన్సిలర్ భర్త బాషా.ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి వచ్చిన సమయంలో ఎవరైనా అతి చేస్తే వారి ఇళ్ల వద్దకు వచ్చి కొడతానని వార్నింగ్‌ ఇచ్చారు. ఉదయం 6 గంటలకు ఎమ్మెల్యే వార్డులోకి వచ్చేసరికి 50 ఇళ్ల పరిధిలో ఉన్న గృహ సారధులతో పాటు అందరూ హాజరు కావాల్సిందేనని హుకుం జారీ చేశారు.ఎమ్మెల్యే గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ముందుగానే ప్రజలకు ట్రైనింగ్ ఇస్తున్నారు కౌన్సిలర్ భర్త. ఎమ్మెల్యే కేతిరెడ్డి వచ్చినప్పుడు ఎవరైనా ఎక్స్‌స్ట్రాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ కార్యక్రమానికి ముందస్తు ప్రిపరేషన్‌పై సోషల్ మీడియాలో బాషా ఆడియో కాల్‌ తెగ హల్‌చల్‌ చేస్తుంది. ఎమ్మెల్యే ఇంటి దగ్గరికి వస్తే మర్యాదగా నడుచుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారాయన.

Tags

Read MoreRead Less
Next Story