వైసీపీ నేతలకి.. కర్మాగారానికి.. కారాగారానికి తేడా తెలియదు.. ఇక ప్రజలకు ఏం సహాయం చేస్తారు: బాలకృష్ణ

వైసీపీ నేతలకి.. కర్మాగారానికి.. కారాగారానికి తేడా తెలియదు.. ఇక ప్రజలకు ఏం సహాయం చేస్తారు: బాలకృష్ణ
మున్సిపల్ ఎన్నికల్లో అధికార బలంతో అభ్యర్థులను వైసీపీ బెదిరించి.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు.

మున్సిపల్ ఎన్నికల్లో అధికార బలంతో అభ్యర్థులను వైసీపీ బెదిరించి.. తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆరోపించారు. హిందూపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో రెండో రోజు బాలకృష్ణ పాల్గొన్నారు. కర్మాగారానికి.. కారాగారానికి తేడా తెలియని వైసీపీ నేతలు.. ప్రజలకు ఏం సహాయం చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. కారాగారానికి వెళ్లి రావడం అధికార పార్టీకి మామూలేనని అన్నారు. ఫించన్లు నిలిపివేస్తే.. వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీయాలని బాలకృష్ణ ప్రజలకు సూచించారు.

Tags

Next Story