AP : గంజాయి విక్రయాలు, రౌడీయిజం అరికట్టడంలో పోలీసులు విఫలం : ఎమ్మెల్యే సునీల్ కుమార్

గూడూరు పట్టణంలో పోలీసులు నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని పట్టణంలో గంజాయి విక్రయాలు, రౌడీయిజం రెచ్చిపోతున్నా అరికట్టడంలో పోలీసులు విఫలమవుతున్నారని వారి చర్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ హెచ్చరించారు. గూడూరు పట్టణంలోని రెండో వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు రోజులుగా గూడూరు పట్టణంలో ఓ ప్రైవేట్ మెడికల్ షాప్ లో గంజాయి విక్రయాలు జరిగాయని మీడియాలో, పత్రికల్లో వచ్చిన విషయంపై వ్యవహరించిన పోలీసుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గంజాయి విక్రయాలు జరిగిన విషయంపై ప్రెస్ మీట్ పెట్టకుండా వివరాలు చెప్పకపోవడంపై డిఎస్పి, సీఐ ల తీరుపై డిఐజి కి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com