MLC Elections: వైసీపీ దొంగ ఓట్లు.. అడ్డుకునే వారే లేరు

ఏపీలో గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో విచ్చలవిడిగా దొంగ ఓట్లు పోల్ చేస్తున్నారు వైసీపీ నాయకులు. అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పదోతరగతి కూడా చదవని వారితో వైసీపీ నేతలు దొంగ ఓట్లు పోల్ చేయిస్తున్నారు. విపక్షాలపై దాడులు చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. తిరుపతిలో పోలింగ్ బూత్‌లు దొంగ ఓటర్లతో నిండిపోయాయి. దొంగ ఓటర్లను టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేస్తున్నారు. 50 మందికి పైగా టీడీపీ నేతలు అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. సంజయ్ గాంధీ కాలనీలో డిగ్రీ చదవని ఆటో డ్రైవర్లు కూడా ఓట్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరో తరగతి కూడా చదవని మహిళ ఓటు వేసేందుకు వచ్చింది. సదరు మహిళను మీడియా ప్రశ్నించడంతో అక్కడి నుంచి పరార్ అయిపోయింది. మరో వైపు వైసీపీ నేత బొమ్మగుంట రవి హల్‌చల్ చేశాడు. తానే స్వయంగా దొంగ ఓటర్లను దెగ్గరుండి తీసుకెళ్లాడు. అయినా పోలీసులు ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు. దీంతో విసక్షాలు మండిపడుతున్నాయి.ఓట్లు గల్లంతవడంతో పోలింగ్ కేంద్రాల దగ్గర పట్టభద్రులు ఆందోళన చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com