Narendra Modi Birthday Wishes : భారత్‌కు సరైన నాయకుడు మోడీ.. సీఎం చంద్రబాబు బర్త్ డే విషెస్..

దేశ ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రధానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తున్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా నరేంద్ర మోడీకి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
సరైన సమయంలో దేశానికి లభించిన సరైన నాయకుడు మోడీ అని చంద్రబాబు అభివర్ణించారు. "సబ్కా సాథ్, సబ్కా వికాస్" అనే ఆయన నినాదం, చేపట్టిన సంస్కరణలు దేశ ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకొచ్చాయని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలో భారతదేశం అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని బలోపేతం చేసుకుందని తెలిపారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' లక్ష్యం కోసం ఆయన చూపిన మార్గాన్ని చంద్రబాబు ప్రశంసించారు. మోడీ మంచి ఆరోగ్యంతో, అపారమైన శక్తితో దేశానికి సేవ చేస్తూ ఉండాలని చంద్రబాబు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com