Modi Birthday Wishes : మోడీ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.. బర్త్ డే సందర్భంగా పవన్ స్పెషల్ వీడియో

Modi Birthday Wishes : మోడీ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం.. బర్త్ డే సందర్భంగా పవన్ స్పెషల్ వీడియో
X

ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేస్తూ, మోడీని ప్రశంసించారు. "మోడీ ఒక పాలనాధ్యక్షుడిగానే కాకుండా, దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ఐక్యతను పెంపొందించిన మార్గదర్శక శక్తిగా ఎదిగారు. ప్రతి పౌరుడు మన సంస్కృతి, వారసత్వం పట్ల గర్వపడేలా చేశారు. ఆత్మనిర్భర్ భారత్ కోసం ఆయన అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు" అని పవన్ అన్నారు.

మోడీ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని పవన్ కొనియాడారు. దృఢ సంకల్పం, నిజాయితీ, ఆధ్యాత్మిక బలంతో దేశాన్ని మార్చివేస్తున్నారని ఆయన అన్నారు. మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో దేశాన్ని నిరంతరం నడిపించేందుకు మరింత శక్తి ఆయనకు ఉండాలని తాను ప్రార్థిస్తున్నానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ పోస్ట్‌తో పాటు మోదీ పాలనను కీర్తిస్తూ ఒక వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.

Tags

Next Story