26 July 2022 2:15 PM GMT

Mohan Babu : చంద్రబాబుతో మోహన్‌బాబు భేటి.. దానిపైనే చర్చ..

Mohan Babu : సినీనటుడు మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది.

Mohan Babu : చంద్రబాబుతో మోహన్‌బాబు భేటి.. దానిపైనే చర్చ..
X

Mohan Babu : సినీనటుడు మోహన్ బాబు మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇందుకు బలం చేకూరుస్తూ ఆయన ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. దాదాపు 2 గంటపాటు ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో ఆయన రాజకీయాల్లోకీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సీనీ, రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే మోహన్ బాబు గతంలో టీడీపీ తరుపున రాజ్యసభ సభ్యులుగా పనిచేశారు. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మోహన్ బాబు.. పలు సందర్భాల్లో బీజేపీకి మద్దతుగా మాట్లాడారు.

Next Story