Crime : మోస్ట్ వాంటెడ్ ఖైదీ పరార్

Crime : మోస్ట్ వాంటెడ్ ఖైదీ పరార్
X

రాజమండ్రి సెంట్రల్ జైలుకు సంబంధించిన మోస్ట్ వాంటెడ్ ఖైదీ బత్తుల ప్రభాకర్ పరార్ అయ్యాడు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి వాయిదా నిమిత్తం విజయవాడ తీసుకువెళ్లారు సెంట్రల్ జైల్ పోలీసులు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించే క్రమంలో ఖైదీ తప్పించుకున్నాడు. దేవరపల్లి మండలం దూదుకూరు జాతీయ రహదారి వద్ద గోదావరి టీ పాయింట్ వద్ద టీ తాగడానికి ఆపిన ఎస్కార్ట్ పోలీసులు .. మూత్ర విసర్జనకు వెళ్లాలని పోలీసులను కోరాడు ముద్దాయి బత్తుల ప్రభాకర్.. పోలీసుల చేతికి ఉన్న బేడీ లను తీసి ఉండడంతో నెట్టి అక్కడ నుంచి పరారయ్యాడు. ముద్దాయి బత్తుల ప్రభాకర్ కోసం పది బృందాలుగా గాలిస్తున్నారు పోలీసులు.. పారిపోయిన ముద్దాయి వైట్ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ ట్రాక్ పాయింట్ తో పాటు చేతికి హ్యాండ్ కప్స్ బేడీలు ఉంటాయని తెలిపారు పోలీసులు..చూట్టు పక్కల ప్రాంతాల్లో కనిపిస్తే.. దేవరపల్లి సిఐ, 9440796584, ఎస్సైలకు 94407 96624 ఈ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు పోలీసులు

Tags

Next Story