MP Kesineni : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నిక

MP Kesineni : ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నిక
X

34 మందితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు అయింది. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షునిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన సర్వ సభ్య సమావేశంలో అధ్యక్షుని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులు. ఈ మేరకు సభ్యులు ఆయన పేరును ప్రతిపాదించగా... పోటీ లేకపోవడంతో మరోసారి కేశినేని శివనాథ్ ఎన్నికైనట్లు సభ్యులు ప్రకటించారు. అనంతరం ACA ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయనకు ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. కాగా ఏసీఏ కార్యదర్శిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీశ్ బాబును ఎన్నుకున్నారు.దీంతో నూతన కమిటీ కొలువు తీరింది.

Tags

Next Story