ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్..ఆసక్తికర అంశాలు వెలుగులోకి..

X
By - Bhoopathi |21 Jun 2023 2:00 PM IST
ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఎంపీ ఎంవీవీ కుటుంబ సభ్యులు కిడ్నాప్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. తాజాగా వైసీపీ నేతను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ సమయంలో సుబ్బలక్ష్మికి. తాను బాకీ ఉన్నానన్న రౌడీషీటర్ హేమంత్ కోటి రూపాయలలో 40 లక్షలు సుబ్బలక్ష్మికి ఇవ్వాలని సూచించాడు. అయితే ఆ డబ్బు తీసుకోవడానికి సుబ్బలక్ష్మి నిరాకరిచింది. దీంతో వైసీపీ నేత పేరును తెరపైకి తెచ్చాడు హేమంత్.అంతేకాదు అతడిని ఏకంగా ఇంటికి పిలిపించుకుని అతడితో సుబ్బలక్ష్మికి ఫోన్ చేయించి డబ్బులు తీసుకునేలా చర్యలు తీసుకున్నాడు. అయితే.. ఆ వైసీపీ నేత ఈ వ్యవహారం గురించి పోలీసులు చెప్పలేదు. దీంతో ఆయన పాత్రపై ఆరా తీస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com