అప్పుల్లో ఆంధ్ర ప్రథమ స్థానంలో ఉంది: ఎంపీ రఘురామకృష్ణరాజు

జగన్ సర్కార్ చేస్తున్న అప్పులతో ఏపీ దివాళాంధ్రప్రదేశ్‌గా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. దేశంలో ఏ రాష్ట్రం చేయనన్ని అప్పులు ఏపీ మాత్రమే చేసిందని అన్నారు. అప్పుల్లో ఆంధ్ర ప్రథమ స్థానంలో ఉందన్నారు. ద్రవ్యలోటు అయితే మరీ దరిద్రంగా మారిందని విమర్శించారు. అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం అవసరమా అని ప్రశ్నించారు. కొత్తగా మూడు పోర్టులు కట్టాలంటే ఇంకెంత అప్పు చేయాలో ఆలోచించాలని హితవు పలికారు. రామాయపట్నం పోర్టు నిర్మాణానికి కోట్లు కావాలని, దాని కోసం ఏం అమ్ముతారని ప్రశ్నించారు. అంత డబ్బే ఉంటే పోలవరం, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయండని సలహా ఇచ్చారు. అనుభవం లేని మందుల కంపెనీకి పోర్టుల నిర్మాణ బాధ్యతలు ఇస్తే ఎలా అని నిలదీశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com