20 March 2021 6:06 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ప్రధాని మోదీకి ఎంపీ...

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ

ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు.

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ
X

రాష్ట్రాల్లో ఉచిత పథకాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ ప్రధాని మోదీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. ఉచిత పథకాలలో రాష్ట్రాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ప్రజలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని.. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలను విస్మరిస్తున్నాయన్నారు.

రాష్ట్రాలు ప్రకటిస్తున్న ఉచిత పథకాలను నియంత్రించాల్సిన సమయం ఆసన్నమైందని సూచించారు. రాష్ట్ర ఖజానాలను ఉచితాలకు పంచిపెట్టి మరిన్ని నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారని వెల్లడించారు. ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య కేంద్రం వివక్ష చూపుతోందనే ఆరోపణలకు ఇదే మూలకారణమని చెప్పారు.


Next Story