Raghurama Krishna Raju : ఆర్మీ ఆసుపత్రి నుంచి ఎంపీ రఘురామకృష్ణంరాజు డిశ్చార్జ్

Raghurama Krishna Raju : నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్మీ డాక్టర్లు రఘురామకి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స అనంతరం రఘురామకృష్ణరాజు డిశ్చార్జ్ అయ్యారు. విడుదల అనంతరం రఘురామ ఢిల్లీ వెళ్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. పలువురు కేంద్ర పెద్దలతో సమావేశం కానున్నారు.
తనపై జరుగుతున్న దాడులు గురించి వివరించే అవకాశం ఉంది. అటు ఈనెల 21న రఘురామ సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తుంది. కోర్టు ఆదేశాలతో రఘురామ సోమవారం విడుదల అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు చెప్పారు. అలాగే సీఐడీ కోర్టులో షూరిటీ పిటిషన్ వేశారు. కానీ రఘురామకు చికిత్స కొనసాగిస్తున్నట్లు ఆర్మీ వైద్యులు తెలిపారు. మరో నాలుగు రోజులు ట్రీట్మెంట్ అవసరమని చెప్పారు.
ఈ నేపథ్యంలో విడుదల ఆలస్యమైంది. సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితిని మెజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమ్మరీ కోరారు. ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మెజిస్ట్రేట్ కి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయనకు చికిత్స అందించిన వైద్యులు ఇవాళ డిశ్చార్జ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com