YS Jagan : సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ..!

YS Jagan : సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు మరో లేఖ..!
ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు వరుస లేఖలు సంధిస్తున్నారు. తాజాగా మరో లేఖ రాశారు.

ఏపీ సీఎం జగన్‌కు ఎంపీ రఘురామకృష్ణరాజు వరుస లేఖలు సంధిస్తున్నారు. తాజాగా మరో లేఖ రాశారు. శాసన మండలి రద్దు ప్రకటనపై ముందుకు వెళ్లాలని లెటర్‌లో పేర్కొన్నారు. మండలిలో అధికార పార్టీ బలం పెరిగినంత మాత్రన... ఈ అంశంపై వెనక్కి తగ్గొద్దని సూచించారు. మూడు రాజధానుల బిల్లుకు అడ్డుపడిందన్న ఉద్దేశంతోనే మండలిని రద్దు చేయాలని భావించారని... కొంతకాలం ఓపిక పడితే పార్టీకి బలం పెరుగుతుందని తెలిసి కూడా మండలిని రద్దు చేయాలనుకున్నారని తెలిపారు. శాసన మండలి వల్ల ఎంతో ప్రజాధనం కూడా వృథా అవుతుందని కూడా ప్రకటించారని గుర్తు చేశారు. మండలి నిర్వహణ కోసం 60 కోట్లు ప్రజా ధనం వృథా అవుతుందన్న మీరు... మీ విలాసాల కోసం 26 కోట్లు ఖర్చు చేశారని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారని లేఖలో తెలిపారు.

అప్పట్లో వైసీపీకి మండలిలో బలం లేనందున రద్దు నిర్ణయం తీసుకున్నారనే విమర్శలు ప్రతిపక్షాలు విమర్శలు చేశాయని... ఇప్పుడు ఆ విమర్శలకు సమాధానం చెప్పే అవకాశం వచ్చిందంటూ లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు సంఖ్యాబలం పెరిగినా సరే మండలిని రద్దు చేయాల్సిందేనని అన్నారు. అలాగే వెంటనే మండలిని సమావేశపరిచి.... అదే మండలిచే రద్దు తీర్మానం చేయించాలన్నారు. ఇప్పటికే మండలి రద్దుపై శాసన సభ తీర్మానం చేసి, పార్లమెంట్‌కు పంపిందని... రానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో మండలి రద్దుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ చురకలు అంటించారు. సీఎం మడమ తిప్పని వ్యక్తిగా నిరూపించేందుకు మండలి రద్దు నిర్ణయాన్ని తన భూజస్కంధాలపై వేసుకుంటానంటూ సీఎం జగన్‌కు రాసిన లేఖలో తెలిపారు ఎంపీ రఘురామ.

Tags

Read MoreRead Less
Next Story