బతిమిలాడి వైసీపీ లోకి తీసుకొచ్చిన రెండో రోజే అలా చేశారు:రఘురామకృష్ణరాజు

బతిమిలాడి వైసీపీ లోకి తీసుకొచ్చిన రెండో రోజే అలా చేశారు:రఘురామకృష్ణరాజు

సొంత పార్టీ తీరుపై మరోసారి మండిపడ్డారు ఎంపీ రఘురామకృష్ణరాజు.. తనను ఎంపీగా అనర్హుడిని చేయలేకనే ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తనపై కేసు నమోదైన 6వ తేదీనే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలిశారని.. అదే రోజున పంజాబ్ నేషనల్ బ్యాంక్ చైర్మన్ ముఖ్యమంత్రిని కూడా కలవడం అనుమానాలకు తావిస్తోంది అన్నారు.

ఎలాగూ మూడు నాలుగు నెలల్లో జైలుకు వెళ్లే వారిపై మరోకేసు వేయడం ఎందుకని తాను ఊరుకుంటున్నాను అన్నారు.. తనను బతిమిలాడి వైసీపీ లోకి తీసుకొచ్చిన రెండో రోజే టిక్కెట్ ఇవ్వరాదని కుట్రకు తెరలేపరని.. ప్రశాంత్ కిషోర్ జోక్యంతోనే తనకు పోటీ చేసే అవకాశం వచ్చిందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story