Home
 / 
ఆంధ్రప్రదేశ్ / అచ్చెన్నాయుడు...

అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

టీడీపీ నేతలను మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ హింసా రాజకీయాలు ఎంత వరకు అని ప్రశ్నించారు.

అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండించిన ఎంపీ రామ్మోహన్‌ నాయుడు
X

నిమ్మాడలో అచ్చెన్నాయుడు అరెస్టును ఎంపీ రామ్మోహన్‌ నాయుడు తీవ్రంగా ఖండించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తుంటే స్పందించని పోలీసులు.. టీడీపీ నేతలను మాత్రం అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఈ హింసా రాజకీయాలు ఎంత వరకు అని ప్రశ్నించారు. ప్రజల్లో కింజారపు కుటుంబానికి ఉన్న ఆదరణను జీర్ణించుకోలేక వైసీపీ ప్రభుత్వం ఇలాంటి అరాచకాలకు పాల్పడుతోందని రామ్మోహన్‌ నాయుడు మండిపడ్డారు.

Next Story