Mudragada Padmanabham : నిలకడగానే ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం

Mudragada Padmanabham : నిలకడగానే ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం
X

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం నిలకడగా ఉంది. ముద్రగడ పద్మనాభం ప్రస్తుతం విజయవాడలోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (AIG) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యుల బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ముద్రగడ పద్మనాభం కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇటీవల శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో శనివారం (జూలై 19, 2025) రాత్రి ఆయన అస్వస్థతకు గురయ్యారు. మొదట ఆయన్ను కాకినాడలోని అహోబిలం ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కాకినాడ మెడికవర్ ఆసుపత్రిలోని ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. ఆదివారం రాత్రి లేదా సోమవారం ఉదయం ఎయిర్ అంబులెన్స్‌లో రాజమహేంద్రవరం ఎయిర్‌పోర్టు నుంచి ఆయనను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ముద్రగడ కుమారుడు గిరిబాబు తన తండ్రి ఆరోగ్యం క్షీణించిందని వస్తున్న ప్రచారాన్ని ఖండించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందవద్దని ఆయన కోరారు. అయితే, ముద్రగడ కుమార్తె క్రాంతి గతంలో తన తండ్రికి క్యాన్సర్ ఉందని, సరైన వైద్యం అందించడం లేదని ఆరోపణలు చేసిన సంగతి తెలిసి తెలిసిందే.

Tags

Next Story