YS Jagan : జగన్ ను చుట్టుముడుతున్న కేసులు.. తుది దశకు విచారణలు..

మాజీ సీఎం జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలకు సంబంధించిన అనేక కేసులు ఇప్పుడు ఆయనను చుట్టుముడుతున్నాయి. అధికారం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి అప్పటి ప్రతిపక్ష నేతలను దారుణంగా వేధించారు. అప్పటి ఐపీఎస్ అధికారులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించారు. ఇక స్కాములు ఎన్ని చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లిక్కర్ కేసు, కల్తీ లిక్కర్, తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కుంభకోణం లాంటి పెద్ద కేసులు ఇప్పుడు తుది దశకు lచేరుకుంటున్నాయి. ఇవే కాకుండా ఇంకా lఎన్నో కేసులు జగన్ దాకా వస్తున్నాయి. ఈ అన్ని కేసుల్లో సాక్షాలు అంతిమలబ్ధిదారుడి వైపు విచారణ సాగిస్తున్నాయి. ఈ కేసుల్లో ఇప్పటివరకు కిందిస్థాయిలో ఉన్న నేతలు మాత్రమే అరెస్ట్ అవుతున్నారు. ఇంకోవైపు ఐపిఎస్ అధికారులు కూడా అరెస్ట్ అయి ఇంకొందరు సస్పెన్షన్ లో ఉంటున్నారు.
అయితే ఈ కేసుల్లో నుంచి తప్పించుకోవడానికి జగన్ చాలా రకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు వైసీపీలోనే తీవ్ర ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసుల్లో విచారణలు తుది దశకు చేరుకోవడంతో.. అతి త్వరలోనే అంతిమ లబ్ధిదారుడిని బయటపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో జగన్ అండ్ కో అలర్ట్ అయినట్టు సమాచారం. ఇప్పటికే న్యాయ నిపుణులతో ఈ కేసుల నుంచి ఎలా బయటపడాలని రకరకాల చర్చలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో కక్షపూరితంగా కేసులు పెట్టారు అంటూ వాదించిన జగన్.. ఇప్పుడు ఈ కేసులతో తనకు సంబంధం లేదు అన్న రేంజ్ లో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కేసుల్లో సాక్షాలు త్వరగా దొరకవు విచారణ నెమ్మదిగా సాగుతుంది అనుకున్నారు కాబోలు.
అందుకే ఇవి తన దాకా వస్తాయా అన్నట్టు ఇన్ని రోజులు జగన్ మాటలు ఉండేవి. కానీ ఇప్పుడు ఈ కేసులతో తనకు సంబంధం లేదు అని నిరూపించుకోవడానికి రకరకాల ఎత్తుగడలు వేస్తున్నట్టు కూటమినేతలు ఆరోపిస్తున్నారు. జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఈ కేసుల్లో నుంచి తప్పించుకోలేరు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు కూటమి నేతలు.
Tags
- Y. S. Jagan Mohan Reddy
- YSRCP
- Andhra Pradesh politics
- liquor scam case
- adulterated liquor case
- Tirumala laddu ghee controversy
- IPS officers arrest
- suspension of officials
- corruption allegations
- final beneficiary investigation
- legal strategy talks
- coalition leaders warning
- AP political developments
- Andhra Pradesh News
- Latest Telugu News
- TV5 News
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
