Kurnool: రేకుల షెడ్డుకు రూ.లక్షా 35వేల పన్ను.. భారీగా వడ్డీతో కలిపి..

Kurnool: రేకుల షెడ్డుకు రూ.లక్షా 35వేల పన్ను.. భారీగా వడ్డీతో కలిపి..
Kurnool: కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Kurnool: రేకుల షెడ్డుకు లక్షా 35వేల పన్ను వేశారు అధికారులు. దీంతో కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రేకుల షెడ్డుకు వడ్డీతో కలిపి ఏకంగా లక్షా 35వేల పన్ను వేశారు. అది చూసి నిర్వాహకుడు ఖంగుతిన్నాడు. వీకర్‌ సెక్షన్‌ కాలనీలోని పాత రేకుల షెడ్డులో టీ హోటల్ నిర్వహిస్తున్నాడు వాసు అనే వ్యక్తి.

అయితే.. 42వేల వడ్డీతో కలిపి లక్షా 35వేల ఇంటి పన్ను విధించారు అధికారులు. దీంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. 2017-18లో 119 రూపాయలు ఉన్న ఇంటి పన్ను.. ఇప్పుడు 9వేల 420కి ఎలా పెరిగిందని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుల్లారెడ్డి ప్రశ్నించారు. చిరువ్యాపారుల ఇంటి పన్నులు రద్దు చేయాలని.. లేకపోతే ఆందోళనలకు సిద్ధమని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story