Nellore District : వినాయక విగ్రహ పూజలో ముస్లిం కుటుంబం

Nellore District : వినాయక విగ్రహ పూజలో ముస్లిం కుటుంబం
X

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం లోని 14వ వార్డు నారాయణరావుపేట ప్రాంతంలో నెలకొల్పిన వినాయక విగ్రహ పూజలో ఉభయకర్తలుగా ముస్లిం కుటుంబం పాల్గొని పూజలు నిర్వహించడం విశేషంగా నిలిచింది..ఈ ప్రాంతంలో నివసించే ప్రభుత్వ టీచర్ అయిన మస్తాన్ ఈ ప్రాంత వాసుల కోరిక మేరకు వినాయక చవితి పండుగ కోసం వినాయక విగ్రహాన్ని సొంత ఖర్చులతో అందించారు. అలాగే వినాయక స్వామి పూజ కార్యక్రమంలో మస్తాన్ మరియు ఆయన సతీమణి మోబీన దంపతులు నేడు పూజలో ఉభయకర్తలుగా కూర్చొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు..వారి సొంత ఖర్చులతోనే పూజా సామాగ్రి, తీర్థప్రసాదాలు మిగిలిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా మతసామరస్యానికి ప్రతీకగా తాను భావించి ఈ పూజ కార్యక్రమంలో తన కుటుంబ సమేతంగా పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించినట్టు మస్తాన్ తెలిపారు.. ఆత్మకూరు ప్రాంతంలో ఓ ముస్లిం కుటుంబం వినాయక పూజలో పాల్గొనడం ఇదే ప్రధమమని ముఖ్యంగా విగ్రహ దాతగా విగ్రహాన్ని అందించి ఉభయకర్తలుగా కుటుంబం పూజలు నిర్వహించడం నిజంగా అభినందించదగ్గ సంతోషకరమైన విషయం అని పలువురు తెలిపారు.. ఈ సందర్భంగా ఈ దంపతులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీ పట్టణ బీసీ నాయకులు అంబటి.నాగేశ్వరరావు వినాయక మండప కమిటీ చైర్మన్ కటారి.సుధాకర్ ముస్లిం నాయకులు ఖాదర్ బాషా, బొబ్బల.చిన్నయ్య, కాసా.రమణారెడ్డి, బిజెపి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు...

Tags

Next Story