మెరుగైన ట్రీట్ మెంట్ అందించండి.. సీఎం చంద్రబాబు ఆదేశం.

మెరుగైన ట్రీట్ మెంట్ అందించండి.. సీఎం చంద్రబాబు ఆదేశం.
X

శ్రీకాకుళం డయేరియా కేసులో, రాజమండ్రి కల్తీపాల కేసులో బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ రెండు కేసులపై తాజాగా వైద్య అధికారులు, జిల్లా యంత్రాంగంతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ రెండు ఘటనల్లో పురోగతి గురించి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఈ రెండు కేసుల దర్యాప్తులో ఎక్కడ దాకా వచ్చాయి, బాధితుల ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది అనే విషయాలను తెలుసుకున్నారు సీఎం చంద్రబాబు. శ్రీకాకుళం జేమ్స్ ఆస్పత్రిలో ఇద్దరు బాధితులు సీరియస్ కండిషన్లో ట్రీట్మెంట్ పొందుతున్నారని అధికారులు తెలిపారు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి గురించి సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇందులో ఒకరు వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారని.. ఇంకొకరికి డయాలసిస్ చేస్తున్నట్టు తెలిపారు అధికారులు.

ఇప్పటివరకు ఉన్న బాధితులే కాకుండా కొత్తగా ఎవరికైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా అనే విషయాలను కూడా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. శ్రీకాకుళం ఘటనలో ప్రస్తుతానికి 76 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని.. ఇందులో ఇద్దరు మాత్రమే సీరియస్ గా ఉన్నారని మిగిలిన వారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే పైపులైను ద్వారా మంచినీటి సరఫరాను ఆపేసామని.. అక్కడి ప్రజలకు పూర్తిగా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నట్టు తెలిపారు. రాజమండ్రి కల్తీ పాల ఘటనలో బాధితులు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని.. ఎప్పటికప్పుడు వారి ఆరోగ్య స్థితిపై వివరాలు తెలుసుకుంటున్నట్టు అధికారులు వివరించారు.

బాధితులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఎప్పటికప్పుడు అధికారులు అలర్ట్ గా ఉండి ఈ రెండు ఘటనల్లో మరో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండద్దని.. ఇలాంటి ఘటనలు మరోసారి రిపీట్ కాకుండా చూడాలని అధికారులను చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

Tags

Next Story