Chandrababu Naidu : బిల్ గేట్స్ రాకను సరిగ్గా వాడుకున్న చంద్రబాబు..

Chandrababu Naidu : బిల్ గేట్స్ రాకను సరిగ్గా వాడుకున్న చంద్రబాబు..
X

ఒక ప్రపంచ కుబేరుడు మన ప్రాంతానికి వస్తున్నారంటే కచ్చితంగా మన విజన్ ఏంటనేది అతని ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాలి. అప్పుడే మన బ్రాండ్, మన విధానాలు ప్రపంచ మార్కెట్ కు తెలిసి మరింత పెట్టుబడులు, ఇన్నోవేషన్లు వస్తాయనేది సీఎం చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే బిల్ గేట్స్ ఏపీకి వస్తున్నారంటే తన విజన్ ఏంటో ఆయన ముందు పెట్టేశారు సీఎం చంద్రబాబు నాయుడు. టెక్నాలజీని విరివిగా వాడే రాష్ట్రాల్లో ఏపీ ఎప్పుడూ ముందే ఉంటుంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు టెక్నాలజీని ప్రతి పనికి వాడేసి ప్రజలకు మరింత మెరుగైన సమాజాన్ని అందించేందుకు ఆయన ప్రయత్నిస్తుంటారు కదా. ఇప్పుడు బిల్ గేట్స్ కు కూడా తన పరిపాలన నుంచి వ్యవసాయం దాకా టెక్నాలజీని ఎలా వాడుతున్నామనేది వివరించారు.

డేటా లేక్, అవేర్ 2.0, వాట్సాప్ గవర్నెన్స్, సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టు గురించి తెలిపారు. ప్రజలకు పౌరసేవను మరింత వేగంగా టెక్నాలజీ సాయంతో ఎలా అందిస్తున్నామనేది సీఎం చంద్రబాబు వెల్లడించారు. అలాగే వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం దగ్గరి నుంచి.. ఇతర టెక్నాలజీని ఎలా వాడుతున్నాం అనేది బిల్ గేట్స్ కు తెలిపారు సీఎం చంద్రబాబు. ఆయన విజన్ ను చూసిన బిల్ గేట్స్ కూడా ఫిదా అయిపోయారు.

బిల్ గేట్స్ ఏపీకి వచ్చి ఏమేం చూశారు.. ఏమేం తెలుసుకున్నారు.. ఏపీ గవర్నమెంట్ టెక్నాలజీని ఎందులో ఎలా వాడుతోంది అనే విషయాలు ఇటు నేషనల్ మీడియా నుంచి ఇంటర్నేషనల్ మీడియా ఛానెళ్ల దాకా అన్నీ కవర్ చేశాయి. ఇది ఒక రకంగా ఏపీకి వచ్చే గుర్తింపుతో సమానం. చంద్రబాబు నాయుడు ఆలోచించింది కూడా ఇదే. ఇంటర్నేషనల్ పాపులర్ పర్సన్ మన దగ్గరకు వస్తే.. అతిథి మర్యాదలతో పాటు మన దగ్గరున్న విషయాలను కూడా ప్రపంచానికి చాటి చెప్పుకోవాలి. ఆ విషయంలో చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యారనే అంటున్నారు కూటమి నేతలు.

Tags

Next Story