Janasena : పవన్ బలమైన నాయకుడిగా ఎదిగినందునే వ్యక్తిగత విమర్శలు : నాదెండ్ల

Janasena : ఏపీ ప్రభుత్వంపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం సినీ పరిశ్రమలో ఎందుకు జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించారు. ఇండస్ట్రీలో ఎంతో మంది పేదలు ఉన్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారనే భయంతోనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని... ఇండస్ట్రీని కాపాడేందుకు పవన్ దేనికైనా సిద్ధంగా ఉంటారన్నారు నాదెండ్ల మనోహర్. జనసేన బలమైన న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందన్నారు నాదెండ్ల మనోహర్. జనసైనికులపై అక్రమంగా కేసులు పెడితే లీగల్ సెల్ చూసుకుంటుందన్నారు. పవన్ వ్యక్తిగత ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినా... ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఎన్నికల సమయంలో పాదయాత్ర చేసిన జగన్.... ఇప్పుడు రోడ్లపైకి వచ్చి ప్రజలు పడుతున్న అవస్థలు చూడాలన్నారు నాదెండ్ల మనోహర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com