Nadendla Manohar : ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేనదే అధికారం : నాదెండ్ల

Nadendla Manohar : ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా జనసేనదే అధికారం : నాదెండ్ల
Nadendla Manohar : వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని... ఎన్నికలు ఎప్పుడు జరిగినా... జనసేన పార్టీదే అధికారమన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌.

Nadendla Manohar : వైసీపీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయిందని... ఎన్నికలు ఎప్పుడు జరిగినా... జనసేన పార్టీదే అధికారమన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన.. జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ జిల్లాల్లో రైతుల పరిస్థితి దారుణంగా తయారయ్యిందని... ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. సీఎం పర్యటనకు 3 రోజుల పాటు చిరు వ్యాపారులతో షాపులు మూయించారన్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే... సంక్షేమ పథకాలు రద్దు చేస్తామంటూ అధికారులు బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాలు బాగా పడుతున్నాయని చెబుతున్న మంత్రులు... 5 లక్షల ఎకరాల్లో వరిసాగు ఎందుకు నిలిచిపోయిందో చెప్పాలన్నారు నాదెండ్ల మనోహర్‌.

Tags

Read MoreRead Less
Next Story