Naga Babu : ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకు పరాకాష్టకు చేరుతోందంటూ నాగబాబు ట్వీట్

Naga Babu : ఆంధ్రప్రదేశ్ రాజకీయం రోజురోజుకు పరాకాష్టకు చేరుతోందంటూ నాగబాబు ట్వీట్
Naga Babu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పట్ల అసెంబ్లీలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరును అందరూ తప్పు పడుతున్నారు.

Naga Babu : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పట్ల వైసీపీ నేతలు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబుకు జరిగిన అవమానంపై సినీ నటుడు, జనసేన నేత నాగబాబు కూడా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు నాగబాబు.

రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఇది ఎంతో దుర్దినమని నాగబాబు అన్నారు. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తలచుకొని బాధపడాలో లేక భయపడాలో తెలియని సందిగ్ద దుస్థితి ఏర్పడిందని అన్నారు.. చంద్రబాబు తమకి ప్రత్యర్ధి అయ్యుండచ్చని .. తెలుగుదేశం పార్టీ తమ తోటి విపక్షం కావచ్చనీ.. కానీ చంద్రబాబునాయుడు లాంటి ఒక సీనియర్ నేత ఇలా కన్నీటి పర్యంతం అయిన ఘటన తనని ఎంతో దిగ్బ్రాంతికి గురిచేసిందని తెలిపారు నాగబాబు.

ఆంధ్ర రాష్ట్ర రాజకీయం రోజురోజూకి పరాకాష్టలకు నిలయంగా మారుతోందని నాగబాబు అభిప్రాయపడ్డారు. ఒకరిని విమర్శించే నైతిక హక్కు తప్ప... వారిని తిట్టే లేదా వారి కుటుంబాలను దూషించే అధికారం ఎవరికీ ఏ మాత్రం లేదని అన్నారు. గతంలో తన తమ్ముడు పవన్‌ కళ్యాణ్‌ ని, తన కుటుంబాన్ని ఇలాగే అనుచితంగా విమర్శించినప్పుడు ఎంతో క్షోభకు గురైన వ్యక్తిగా... ఆ బాధను అనుభవించిన వ్యక్తిగా చెప్తున్నానని నాగబాబు తెలిపారు.

ఇది అనాగరికమని, సాటి మనుషుల పట్ల క్రూరత్వంగా ప్రవర్తించడమని చెప్పారు. ఒకరు చేసింది తప్పని అనిపిస్తే ప్రశ్నించు, నిలదీయు లేదా తప్పు ఉంటే కమిటీ వేసి నిరూపించి శిక్షించండి. కానీ ఇలాంటి నీచ సంస్కృతికి దిగజారకండి. ఏ పార్టీ అయినా సరే... ఏ నాయకుడైనా సరే ... తోటివారి పట్ల కనీస గౌరవాన్ని పాటించి ఇకనైనా మనుషులుగా మారుతారని ఆశిస్తున్నానని నాగబాబు ట్వీట్ లో పేర్కొన్నారు.





Tags

Read MoreRead Less
Next Story