Konidela Nagababu : నాగబాబుకు ఎమ్మెల్సీ టికెట్.. దక్కే మంత్రి పదవి ఇదే!

జనసేన పార్టీకి కేటాయించిన ఒక ఎమ్మెల్సీ స్థానానికి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పేరును డిప్యూటీ సీఎం, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారు. ఈ మేరకు జనసేన ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్ బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ పదవికి సంబంధించి నామినేషన్ పత్రాలను సిద్దం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ సూచిం చా రన్నారు. ఇక నాగబాబు జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్కు అండగా ఉంటూ వచ్చారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలతోపాటు, కార్యకర్తలు, నాయకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు తెలుసుకుంటూ వస్తున్నా రు. 2019 ఎన్నికల్లో నర్సాపురం పార్లమెంట్ నుంచి ఎంపీగా తొలిసారి పోటీచేసి ఆయన ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో తొలుత అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు రాగా.. చివరికి పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి ఇచ్చారు. పొత్తు కోసం జనసేన పార్టీ ఆ ఎంపీ సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో ఓడిపోగా.. 2024 ఎన్నికల్లో మాత్రం పిఠాపురం నియోజకవర్గం నుంచి బంపర్ మెజార్టీతో విక్టరీ సాధించారు. ఈ గెలుపు వెనుక పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు పాత్రకూడా ఉంది. దాదాపు 40-50 రోజులు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటూ.. తన తమ్ముడు పవన్ గెలుపుకోసం అన్నగా బాధ్యత తీసుకుని కష్టపడి పనిచేశారు. నాగబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రచారం చేయడం, పవన్ kg ఉన్న ఫాలోయింగ్ la పిఠాపురంలో తిరుగులేని మెజార్టీ వచ్చింది. కాకినాడ ఎంపీకి కూడా మంచి మెజార్టీ రావడానికి దోహదపడింది. మరోవైపు.. నాగబాబు ఎమ్మెల్సీ అయ్యాక మంత్రి పదవి వరిస్తుందని సమాచారం. కీలకమైన మున్సిపల్ లేదా రెవెన్యూ పోర్టుపోలియో ఇస్తారని చెబుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com