Nagababu : నేడు నాగబాబు నామినేషన్

Nagababu : నేడు నాగబాబు నామినేషన్
X

జనసేన పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసేందు కు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు సిద్ధమయ్యారు. ఇప్పటికే నాగబాబు పేరును జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఇక నామినేషన్కు అవసరమైన పత్రాలను పార్టీ నేతలు సిద్ధం చేస్తున్నారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ 10 మంది శాసనసభ్యులు గురువారం సంతకాలు చేశారు. సంతకాలు చేసిన వారిలో మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, లోకం నాగ మాధవి, ఆరణి శ్రీనివాసులు, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, పత్సమట్ల ధర్మరాజు, అరవ శ్రీధర్, బత్తుల బలరామకృష్ణ, పంతం నానాజీ ఉన్నారు. శుక్రవారం మధ్యాహ్నం నాగబాబు నామినేషన్ వేయనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. దీంతో నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తారన్న వార్తలకు తెరడిపడినట్లైంది. తాజాగా శాసనమండలిలో ఐదు స్థానాలు ఖాళీ అయ్యాయి.. అందులో ఒక స్థానం జనసేనకు దక్కనుంది. ఇక ఎమ్మెల్సీతోపాటు మంత్రివర్గంలో నాగబాబుకు చోటు కల్పిస్తామని చంద్రబాబు గతంలో ప్రకటించారు. ఆ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జనసేన పార్టీ కార్యాలయం నుంచి వచ్చిన నోట్లో ఎమ్మెల్సీగా నాగబాబు పేరుని ఖరారు చేసినట్లు పేర్కొన్నారు.

Tags

Next Story