26 కంపెనీలకు ఆమోదం.. ఏపీకి న్యూస్

26 కంపెనీలకు ఆమోదం.. ఏపీకి న్యూస్
X

సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏపీకి భారీ స్థాయిలో పెట్టుబడులను తీసుకురావడమే తన ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. వైసిపి హయాంలో కానరాని పెట్టుబడులను ఇప్పుడు వెంటపడి మరే తీసుకొస్తున్నారు. ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కూడా జరిగిపోయాయి. కాబట్టి ఇప్పుడు వాటిని ఆమోదించడం మాత్రమే మిగిలింది. నేడు సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 13వ ఎస్ఐపిబి సమావేశం జరిగింది. ఇందులో 26 కంపెనీలకు ఆమోదముద్ర వేసింది ఎస్ఐపిబి. దాదాపు 20444 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పెట్టుబడుల సదస్సులు కుదుర్చుకున్న ఒప్పందాలపై సరైన పద్ధతిలో ఎంవోయులను సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

వాటి ఆధారంగా ఈ కంపెనీలకు జనవరి ఆఖరిలోగా శంకుస్థాపనలు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. పర్మిషన్ల విషయంలో ఎలాంటి లేట్ చేయొద్దని.. కంపెనీలకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పుడు వచ్చిన కంపెనీలకు అన్ని రకాలుగా సహాయాలు అందిస్తూ ఏర్పాటు అయ్యేలా చూస్తే వాటిని చూసి మిగతా కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తాయనేది సీఎం చంద్రబాబు నాయుడు ఆలోచన. సీఎం చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న లీడర్ కాబట్టి ముందు జాగ్రత్తతో ఏమేం చర్యలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నారు.

నిజంగా ఇది ఏపీకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కంపెనీలు పెద్ద ఎత్తున జనవరిలోపు సిద్ధమైతే ఆలోపు ఏపీ యువతకు జాబులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. 2029 లోపు 24 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ముందు నుంచే చంద్రబాబు నాయుడు చెబుతూనే ఉన్నారు. అందులో భాగంగా ఇప్పటినుంచి జాబుల జాతర మొదలు కాబోతోంది. వీటితోపాటు మిగిలిన కంపెనీలను కూడా త్వరలోనే ఆమోదం తెలిపి స్టార్ట్ అయ్యేలా చూడబోతున్నారు చంద్రబాబు నాయుడు.

Tags

Next Story