10 Jan 2021 4:14 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తిరుపతి ఉప ఎన్నికల్లో...

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం : నల్లారి కిషోర్

ఎన్నికల వ్యూహం, తాజా పరిణామాలపై చర్చించేందుకు జరిగిన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి నేతలంతా హాజరయ్యారు.

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం : నల్లారి కిషోర్
X

తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి అన్నారు. ఎన్నికల వ్యూహం, తాజా పరిణామాలపై చర్చించేందుకు జరిగిన నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశానికి నేతలంతా హాజరయ్యారు. కలిసికట్టుగా పనిచేస్తే భారీ మెజార్టీ ఖాయమని కిషోర్ కుమార్‌రెడ్డి అన్నారు. వైసీపీ బెదిరింపులకు ఎవరూ భయపడొద్దని, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని, ఇప్పటి తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపిచ్చారు. తిరుపతి బైపోల్‌లో వైసీపీ, బీజేపీలు తమకు పోటీయే కాదన్నారు.

Next Story