సలాం ఘటన మరువకముందే నంద్యాలలో మరో సెల్ఫీ వీడియో కలకలం

అబ్దుల్ సలాం ఘటన మరువక ముందే నంద్యాలలో మరో సెల్ఫీ వీడియో సంచలనం రేపుతోంది. ఎమ్మెల్యే శిల్పా రవి తమను వేధిస్తున్నాడంటూ మునాఫ్ కుటుంబం సెల్ఫీ వీడియో రికార్డ్ చేయడం కలకలం సృష్టిస్తోంది. విద్యుత్ కాంట్రాక్ట్ విషయంలో తలదూర్చి.. ఎమ్మెల్యే రవి తమ వర్గీయులకు ఆ పనులు కేటాయించుకుంటున్నాడని మునాఫ్ కుటుంబ సభ్యులు ఆరోపించారు. 3 లక్షలు పెట్టి కరెంటు బిల్లుల మిషన్లు కొని నష్టపోతున్నామంటూ మునాఫ్ కుమారుడు వాపోయాడు. హైకోర్టుకు వెళ్లి ఆర్డర్ కాపీ తెచ్చుకున్నా.. వేరే కాంట్రాక్టర్‌కి పని అప్పగించి దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు మునాఫ్ కుటుంబ సభ్యులు.
ఎమ్మెల్యే శిల్పారవిని తన తండ్రి తిట్టలేదని, తిట్టినట్లు నిరూపించాల్సంటూ.. సెల్ఫీ వీడియోలో సూరజ్ చెప్పారు. ఎమ్మెల్యే తీరుతో తమ కుటుంబం రోడ్డున పడిందని, ఇప్పుడు తాము చావాలా, బతకాలో అర్థం కావడం లేదన్నారు.
ఇప్పటికే సలాం కుటుంబం ఆత్మహత్య ఏపీలో ప్రకంపనలు రేపుతోంది. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగానే అధికార నేతల వేధింపులపై తాజాగా మునాఫ్ కుటుంబం సెల్ఫీ వీడియో రికార్డ్ కలకలం రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com