KCR: కేసీఆర్‌ను పరామర్శించిన చంద్రబాబు
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని పలువురు ప్రముఖుల పరామర్శించారు. హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్‌ను కలిసి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకోవాలంటూ రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు ఆంకాక్షిస్తున్నారు. హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో తుంటి ఎముకకు శస్త్ర చికిత్స చేయించుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ప్రముఖులు పరామర్శిస్తున్నారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి గవర్నర్ తమిళిసై వాకబు చేశారు. కేటీఆర్‌కు ఫోన్ చేసి కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. శస్త్ర చికిత్స జరిగిన మరుసటి రోజు ప్రోటెం స్పీకర్ కార్యక్రమం సందర్భంగా రాజ్‌భవన్‌కు వచ్చిన తన్నీరు హరీశ్‌రావును కేసీఆర్ ఆరోగ్యంపై అడిగి తెలుసుకున్నానని తెలిపారు. కేసీఆర్ మంచి ఆరోగ్యంగా బయటకు రావాలని అన్నారు. "ఎక్స్" వేదికగా హరీశ్‌రావు, కల్వకుంట్ల కవితకు గవర్నర్ ట్యాగ్ చేశారు.
వైద్యుల పర్యవేక్షణలో ఉన్న కేసీఆర్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోకుంటున్నారని ఆరు వారాల్లో సాధారణ జీవితం గడుపుతారని చంద్రబాబు ఆకాంక్షించారు.. కేసీఆర్‌ను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పరామర్శించారు. కేసీఆర్‌కు అందుతున్న వైద్యసేవలపైనా భట్టి ఆరా తీశారు. కేసీఆర్ వేగంగా కోలుకుంటున్నారని భట్టి తెలిపారు. కేసీఆర్‌ను సినీ ప్రముఖులు చిరంజీవి, ప్రకాష్ రాజ్ కలిసి.. క్షేమ సమాచారం తెలుసుకున్నారు. కేసీఆర్‌ను BSP నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ పరామర్శించి.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.. ప్రముఖుల పరామర్శల దృష్ట్యా... సోమాజీగూడ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసి వాహనా రాకపోకలను పోలీసులు నియంత్రిస్తున్నారు. రెండు రోజుల క్రితం ఫామ్‌హౌస్‌లో కిందపడడంతో గాయపడ్డ కేసీఆర్‌ను వెంటనే సోమాజిగూడ యశోదా దవాఖాన కు తరలించగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు తుంటి ఎముక ఫ్యాక్చర్ అయిందని తెలిపి అదే రోజు రిప్లేస్‌మెంట్ సర్జరీ కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.
విషయం తెలుసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఆదివారం స్వయంగా ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించగా ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి యశోదా దవాఖానకు వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించారు. చిరంజీవి మాట్లాడుతూ కేసీఆర్ చాలా హెల్తీగా ఉన్నారని త్వరలోనే దైనందిన జీవితంలోకి వస్తారంటూ తెలిపారు. సర్జరీ చేసిన 24 గంటల్లోనే నడిపించిన డాక్టర్ల కృషి అభినందనీమయమన్నారు. కేసీఆర్ సినీ ఇండస్ట్రీ గురించి కూడా అడిగారని అంతా బావుందని చెప్పానన్నారు. డాక్టర్లు 8 వారాల విశ్రాంతి తీసుకోవాలని చెప్పారని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆ భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్లు తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com