Chandrababu : గౌతమ్‌ రెడ్డి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది : చంద్రబాబు

Chandrababu : గౌతమ్‌ రెడ్డి మరణ వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది : చంద్రబాబు
Chandrababu : ఏపీమంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

Chandrababu : ఏపీమంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ రెడ్డి చనిపోవడం అత్యంత విచారకరమన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, పనిపట్ల నిబద్ధత ఉన్న నాయకుడిని కోల్పోవడం బాధాకరమన్నారు వెంకయ్య. గౌతమ్‌రెడ్డి తాత సమయం నుంచి వారి కుటుంబంతో తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.

అటు గౌతమ్‌ రెడ్డి మరణ వార్త తనను దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజెస్తున్నట్లు చెప్పారు. ఇక మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి హ‌ఠాన్మర‌ణంతో తీవ్ర దిగ్ర్భాంతికి గుర‌య్యానని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.. ఫిట్నెస్‌కి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే మంత్రికి గుండెపోటు రావ‌డం అత్యంత విచార‌క‌రం. విదేశాల‌లో ఉన్నత‌ విద్యాభ్యాసం చేసి వ‌చ్చినా విన‌యం, విధేయ‌త‌లు ఆయ‌న చిరునామా అని ట్వీట్ చేశారు.


ఐదుప‌దుల వ‌య‌స్సులోనే హుందా గ‌ల రాజ‌కీయ‌వేత్తగా పేరుగాంచిన మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి మ‌న‌కి దూరం కావ‌డం తీర‌ని విషాదం. మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి కుటుంబ‌స‌భ్యుల‌కు ప్రగాఢ సంతాపాన్ని తెలియ‌జేస్తున్నానని లోకేష్ ట్వీట్ లో పేర్కొన్నారు.

గౌతమ్‌ రెడ్డి మరణ వార్త షాక్‌కు గురిచేసిందన్నారు మంత్రి కేటీఆర్. ఇంత చిన్నవయసులోనే ఇలా జరగడం చాలా బాధాకరమన్నారు. నిత్యం ప్రజల గురించే తపించే గొప్ప నాయకున్ని కోల్పోయామన్నారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ. గౌతమ్‌ రెడ్డి తనకు మంచిమిత్రుడని.... 25ఏళ్లుగా ఆయనతో అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు.


Tags

Next Story