Chandrababu Naidu: ఎస్‌ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు!

Ap Panchayat Elections 2021 : తంబళ్లపల్లె నియోజకవర్గ సెగ్మెంట్‌లో పోటీదారుల ఫైనల్ జాబితా ప్రచురించకపోవడంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు చంద్రబాబు. ఎంపీడీఓ దివాకర్ రెడ్డి, ఎస్ఐ సహదేవి, ఎమ్మెల్యే బంధువు భాను, అతని పీఏ హేమంత్ కుమార్‌పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.ప్రతిపక్ష పార్టీ బలపర్చిన అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే ఉద్దేశంతో ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి పోటీదారుల జాబితా ప్రకటించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఎంపీడీఓ దివాకర్ రెడ్డి.. వైసీపీకి లబ్దిచేకూర్చేందుకు పోటీదారుల జాబితాను ప్రకటించడం లేదని అన్నారు చంద్రబాబు. ఎస్ఐ సహదేవి ప్రతిపక్ష అభ్యర్ధుల నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని, తంబళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి ఎన్నికల అక్రమాలకు తెరలేపారని అన్నారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తంబళ్లపల్లిలో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అదనపు పోలీసు బలగాలను వెంటనే పంపాలని ఎస్‌ఈసీకి లేఖ రాశారు చంద్రబాబు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com